ములుగు జిల్లాలో పోలింగ్ కేంద్రం వద్ద తనిఖీలు

ములుగు జిల్లాలో పోలింగ్ కేంద్రం వద్ద తనిఖీలు

వెంకటాపురం, వెలుగు: మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ములుగు జిల్లా వెంకటాపురం మండలం పరిధిలోని ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలను డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు ఆదివారం తనిఖీ చేశాయి. ఈ సందర్భంగా వెంకటాపురం సీఐ బండారు కుమార్ మాట్లాడుతూ ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్​ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పకడ్బందీ చర్యలు చేపట్టామని తెలిపారు. 

ప్రధాన రహదారిపై వెహికల్ చెకింగ్, సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, పోలింగ్ కేంద్రాల వద్ద బాంబ్ డిటెక్టర్, డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేశామని వివరించారు. పట్టభద్రులు నిర్భయంగా ఓటువేయాలని చెప్పారు. కార్యక్రమంలో వెంకటపురం ఎస్సైలు రేఖ అశోక్, కొప్పుల తిరుపతి, సీఆర్పీఎఫ్ బెటాలియన్ పాల్గొన్నారు.