శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎలుకలు, కుక్కలు.. పూర్తిగా లోపించిన పరిశుభ్రత..

శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎలుకలు, కుక్కలు.. పూర్తిగా లోపించిన పరిశుభ్రత..

గండిపేట, వెలుగు: శంషాబాద్ ఎయిర్​పోర్ట్​లో పరిశుభ్రత పూర్తిగా లోపించింది. ఆదివారం రాత్రి ఎయిర్​పోర్టులోని ఓ రెస్టారెంట్ టేబుల్​పై మిగిలిపోయిన ఆహారాన్ని ఎలుకలు, కుక్కలు ఎక్కి తింటుండడంతో దాన్ని ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్​లోడ్​ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్​గా మారడంతో ఈ వ్యవహారంపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని, ప్రయాణికుల ఆరోగ్యం, పరిశుభ్రత దృష్ట్యా విమానాశ్రయ నిర్వహణ సంస్థ తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.