మోడీకి ట్రంప్​ ఫోన్.. జీ7 సమ్మిట్​లో చేరాలని ఆహ్వానం

మోడీకి ట్రంప్​ ఫోన్.. జీ7 సమ్మిట్​లో చేరాలని ఆహ్వానం

న్యూఢిల్లీ: జీ–7 దేశాల కూటమిలో చేరాలంటూ అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​ మన ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించారు. ఈమేరకు మంగళవారం మోడీకి ఫోన్​ చేసిన ట్రంప్.. ఇండియా చైనా బోర్డర్​లో పరిస్థితిపై మోడీతో చర్చించారని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికాలో జరుగుతున్న ఆందోళనలపై మోడీ విచారం వ్యక్తంచేశారని, ఆ సమస్యకు తొందర్లో పరిష్కారం లభించాలని కోరుకుంటున్నట్లు తెలిపారని పేర్కొంది. జీ 7 సమ్మిట్​లో ఇప్పుడున్న దేశాలకు తోడు ఇండియా వంటి ముఖ్యమైన దేశాలకు సభ్యత్వం కల్పించి, దానిని విస్తరించాలని భావిస్తున్నట్లు ట్రంప్​ చెప్పారని తెలిపింది. ఇండియా, చైనా బోర్డర్​ ఇష్యూపై మోడీ–ట్రంప్​ చర్చించారని పీఎంవో వర్గాలు తెలిపాయి.. అయితే, ఈ చర్చ దేని గురించి అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు.

కొత్త విద్యుత్ బిల్లు ఫెడరల్ విధానానికి విరుద్ధం