
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా ‘జై భీమ్’ తీసి మెప్పించిన టీజే జ్ఞానవేల్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) తో వెట్టయాన్ (Vettaiyan) (తెలుగులో వేటగాడు) అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్,ఫాహద్ ఫాజిల్,రానా,మంజు వారియర్,రితికాసింగ్, దుషారా విజయన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కు మంచి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
తలైవా 170గా వస్తోన్న వెట్టయాన్ మూవీపై క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.ఈ మూవీలో రజినీకాంత్ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయినట్లు చిత్ర యూనిట్ తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. వెట్టైయన్ లో తన పాత్ర కామెడీ టచ్ తో ఉంటుందని చెబుతూ సినిమాపై ఆసక్తిని రేకెత్తించాడు రజినీ.
జైలర్ తో ఎలెక్ట్రిఫయింగ్ మ్యూజిక్ అందించిన మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్.వెట్టయాన్ మూవీకి ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నారు. త్వరలో ఈ సినిమా నుంచి పాటల నగరా మోగించడానికి అనిరుధ్ ప్లాన్ చేస్తున్నాడు. ఇక జైలర్ సాంగ్స్ తో దుమ్ములేపిన అనిరుధ్ మరోసారి రజినీకి అదిరిపోయే చార్ట్ బ్లాస్టర్ సాంగ్స్ ఇవ్వడం పక్కా!
దాదాపు రూ.1000 కోట్ల టార్గెట్ దిశగా రానున్న ఈ మూవీ 2024 అక్టోబర్ లో రిలీజ్ కానుంది. మరోవైపు జైలర్ 2 కి సంబంధించిన స్టోరీ లైన్ లో ఉండగా..డైరెక్టర్ లోకేష్ కనగరాజుతో కూలీ సినిమా చేస్తున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో అదిరిపోయింది.
And it is a wrap for our Thalaivar! ?? Superstar @rajinikanth completes filming his portion for Vettaiyan. ?️ ?#VETTAIYAN ?️ @rajinikanth @SrBachchan @tjgnan @anirudhofficial @LycaProductions #Subaskaran @gkmtamilkumaran #FahadhFaasil @RanaDaggubati @ManjuWarrier4… pic.twitter.com/YPcljJ6vVn
— Lyca Productions (@LycaProductions) May 13, 2024