భోజనం తర్వాత నీళ్లు తాగితే తిన్నది అరగదా ? జీర్ణక్రియ దెబ్బతింటుందా ? అసలు నిజం ఇదే..

 భోజనం తర్వాత నీళ్లు తాగితే తిన్నది అరగదా ? జీర్ణక్రియ దెబ్బతింటుందా ? అసలు నిజం ఇదే..

భోజనం చేసిన వెంటనే నీరు త్రాగడం అనేది  ప్రజలు సాధారణంగా చేసే అలవాట్లలో పొరపాటు ఒకటి. ఇంట్లో ఎవరో ఒకరు అలా చేయవద్దని అంటుంటారు. మరొకరు ఇలా చేస్తే జీర్ణక్రియకు సహాయపడుతుందని అంటారు. కానీ ఇప్పటికి దీనిపై ఎదో ఒక గందరగోళం కొందరిలో ఉంటుంది.

 నీళ్లు తాగడం వల్ల మనం తిన్న ఆహారం మెత్తగా మారుతుంది. దీనివల్ల పోషకాలు శరీరానికి త్వరగా అందుతాయి. ఆహారం పేగుల్లో సులభంగా కదలడానికి కూడా నీరు తోడ్పడుతుంది.

చాలామంది ఇళ్లలో  భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగకూడదు, అలా చేస్తే కడుపులో  తిన్నది అరగదు అంటుంటారు. కానీ వైద్యశాస్త్రం ప్రకారం ఇది కేవలం ఒక అపోహ మాత్రమేనని డాక్టర్లు వివరిస్తుస్తున్నారు.  మనం తిన్నాక ఒక గ్లాసు నీళ్లు తాగినంత మాత్రాన కడుపులో జీర్ణక్రియ ఆగిపోదు. మనం తినే ఆహారం, తాగే నీటిని బట్టి కడుపులో ఎంజైమ్‌లు, యాసిడ్లు అవే అడ్జస్ట్ అవుతాయి. సరైన మొత్తంలో నీరు తాగడం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది, అజీర్ణం లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
 
భోజనం చేసాక నీళ్లు తాగడం వల్ల ఇబ్బంది ఉండదు కానీ, ఎంత తాగుతున్నాం అనేది ముఖ్యం. భోజనం చేసిన వెంటనే లీటర్ల కొద్దీ నీళ్లు తాగేస్తే, కడుపు ఫుల్ అయిపోయి కాసేపు ఉబ్బరంగా  అనిపించవచ్చు. అందుకే  ఒక గ్లాసు వరకు తాగడం వల్ల ఎలాంటి నష్టం లేదని డాక్టర్ స్పష్టం చేశారు. భోజనం తర్వాత ఒక గ్లాసు నీళ్లు తాగడం వల్ల మీ జీర్ణక్రియ దెబ్బతినదు. నిజానికి అది మీ శరీరానికి మంచిదే.  
 
 చాలా మందికి భోజనంతో లేదా భోజనం తర్వాత నీరు త్రాగడం మంచిదే.  జీర్ణక్రియకు సపోర్ట్  ఇస్తుంది ఇంకా  మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది అని వైద్య నిపుణులు అంటున్నారు.