యూపీలో మ్యాచ్ జరుగుతుండగా తేనేటీగల దాడిలో అంపైర్ మృతి

యూపీలో మ్యాచ్ జరుగుతుండగా తేనేటీగల దాడిలో అంపైర్ మృతి

లక్నో: మ్యాచ్ జరుగుతుండగా తేనేటీగలు దాడి చేయడంతో సీనియర్ అంపైర్ మాణిక్ గుప్తా ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఉన్నావ్‌లోని సప్రు స్టేడియంలో జరిగిన క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. గురువారం (ఫిబ్రవరి 19) ఉన్నావ్‌లోని సప్రు స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జరిగింది.

మాణిక్ గుప్తా అంపైరింగ్ చేశాడు. ఆయన మ్యాచ్ ముగిశాక డ్రింక్స్ బ్రేక్ సమయంలో తోటి అంపైర్‎ను కలిసేందుకు వెళ్లాడు. ఈ సమయంలో మాణిక్‎తో పాటు అక్కడున్నవారిపై తేనేటీగల గుంపు ఆకస్మాత్తుగా దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ మాణిక్ గుప్తా మరణించాడు. తేనేటీగల దాడిలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. 

ఈ ఘటనపై మాణిక్ గుప్తా సోదరుడు అమిత్ కుమార్ గుప్తా మీడియాతో మాట్లాడారు. మాణిక్ గుప్తా మ్యాచ్ ముగిసింది. కానీ అతని తోటి అంపైర్ వేరే మ్యాచ్‌లో అంపైరింగ్ చేస్తున్నాడు. డ్రింక్స్ బ్రేక్ సమయంలో మాణిక్ అతని దగ్గరకు వెళ్ళాడు. వారిద్దరూ టీ తాగుతుండగా తేనెటీగల గుంపు ఒక్కసారిగా దాడి చేసింది. కొందరు అక్కడినుంచి పరిగెత్తగా.. అమిత్ వయస్సు దృష్ట్యా అక్కడి నుంచి ఉరకలేక నేలపై పడుకున్నాడు. అతనిపై తేనేటీగల గుంపు తీవ్రంగా దాడి చేసింది. 

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడటంతో అమిత్ గుప్తా మరణించాడని తెలిపారు. తన సోదరుడు దాదాపు 30 సంవత్సరాలుగా అంపైరింగ్ చేస్తున్నాడని.. అతను రాష్ట్ర ప్యానెల్ అంపైర్ అని అమిత్ కుమార్ పేర్కొన్నారు. కాన్పూర్ క్రికెట్ సర్క్యూట్‌లో మాణిక్ సీనియర్ ఎంపైర్. దాదాపు 30 ఏండ్లుగా అంపైరింగ్ చేస్తోన్న ఆయన రాష్ట్ర ప్యానెల్ అంపైర్‌గా ఉన్నారు.

కాన్పూర్ క్రికెట్ అసోసియేషన్‌తో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. విషాదంగా తేనేటీగల దాడిలో మాణిక్ గుప్తా ప్రాణాలు కోల్పోవడంపై యూపీ క్రికెట్ అసోసియేషన్, పలువురు క్రికెటర్లు, తోటి అంపైర్లు సంతాపం తెలిపారు.