T20 World Cup: భారత్ సెమీస్కి వెళ్లదు..‘ఓరే పిచ్చి నా కొడకా!’అంటూ పాక్ మాజీ క్రికెటర్‌పై నెటిజన్స్ ఫైర్

T20 World Cup: భారత్ సెమీస్కి వెళ్లదు..‘ఓరే పిచ్చి నా కొడకా!’అంటూ పాక్ మాజీ క్రికెటర్‌పై నెటిజన్స్ ఫైర్

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా రేపటి నుంచి జరిగే సూపర్–8 దశలో జరిగే ప్రతి మ్యాచ్ ‘డూ ఆర్ డై’ లాంటిదే. సెమీఫైనల్స్ టార్గెట్ గా ఎనిమిది జట్లు బరిలోకి దిగుతున్నాయి. సూపర్–8 దశ ప్రారంభానికి ముందే పాకిస్తాన్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్ సెమీఫైనల్స్‌కి చేరదని స్పష్టం చేశాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్ తప్ప భారత్ బ్యాటింగ్ అంతగా నిలకడగా కనిపించలేదనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఒత్తిడి తట్టుకోలేక భారత బ్యాటింగ్ కూలిపోతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించాడు. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు చాలా బలంగా ఉన్నాయి.. ఈ రెండు టీమ్స్ ఏ జట్టునైనా ఓడించే సత్తా ఉందని పేర్కొన్నాడు.  

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ అమీర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అమీర్ వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందిస్తూ, దాయాది దేశం నిరంతరం భారత్‌పై అక్కసు వెల్లగక్కడం తప్ప మరో పని లేదని మండిపడ్డారు. ‘ఓరే పిచ్చి నా కొడకా!’అమీరు.. ముందు నీ పి(పా) కిస్తాన్ ని  న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లో గెలవమని చెప్పుపో అంటూ సూచనలు చేస్తున్నారు. మరోసారి టీమిండియాపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా స్పందిస్తామని నెటిజన్లు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

భారత్ ఇప్పటి వరకు లీగ్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో అన్ని గెలిచింది. సూపర్–8లో చిన్న తప్పు జరిగిన కూడా భారీ మూల్యం చెల్లించాల్సిందే. దక్షిణాఫ్రికా దూకుడుతో పాటు క్రమశిక్షణతో ఆడుతోంది. వెస్టిండీస్ పవర్ హిట్టింగ్‌తో చాలా ప్రమాదకరంగా ముందుకు వెళ్తుండగా.. జింబాబ్వే కూడా పెద్ద జట్లకు తామేమి తక్కువ కాదని ఇప్పటికే ఆసీస్, శ్రీలంక జట్లను ఓడించి చూపించింది. భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కొద్దిగా తడబడినా కూడా, ప్రత్యర్థి టీమ్స్ వెంటనే దాన్ని ఉపయోగించుకుంటున్నాయి.  

భారత్ సూపర్–8 ప్రయాణం ఫిబ్రవరి 22వ తేదీన అహ్మదాబాద్‌లో నరేంద్ర మోడీ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. అనంతరం ఫిబ్రవరి 26న చెన్నైలో జింబాబ్వేతో, మార్చి 1వ తేదీన కోల్‌కతాలో వెస్టిండీస్‌తో తమ గ్రూప్–1లోని చివరి మ్యాచ్ ఆడుతుంది. ఈ నాలుగు మ్యాచులలో సెమీఫైనల్ చేరాలంటే కనీసం రెండు విజయాలు అవసరం.. కాగితంపై ఈజీగా కనిపించినా.. వాస్తవంగా ప్రతి మ్యాచ్ నాకౌట్‌లాంటిదే.

సూపర్–8 గ్రూపులు ఖరారు
గ్రూప్–1: భారత్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ 
గ్రూప్–2  శ్రీలంక, పాకిస్తాన్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్