T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2026లో ఇప్పటికే లీగ్ దశ ముగిసింది. రేపటి (ఫిబ్రవరి 21) నుంచి సూపర్-8 మ్యాచ్ లు స్టార్ట్ కానున్నాయి. ఈ టీ20 వరల్డ్ కప్ లో పసికూన జింబాబ్వే టీమ్ అద్భుత ప్రదర్శనతో సూపర్-8కు దూసుకొచ్చింది. బలమైన ఆస్ట్రేలియాను ఓడిస్తే ఏదో అలా కలిసొచ్చింది వాళ్లకు అనుకున్నారు.. ఆతిథ్య శ్రీలంక జట్టును కూడా ఓడించి సూపర్–8లోని ఇతర జట్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చంది. లీగ్ దశలో జింబాబ్వే విజయాల్లో యువ బ్యాటర్ బ్రియాన్ బెన్నెట్ కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రపంచ కప్ లో బెన్నెట్ అద్బుతమైన ఆట తీరుతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
బ్రియాన్ బెన్నెట్ ఇప్పటివరకు ఆడిన మూడు ఇన్నింగ్స్ లలో.. ఒక్కసారి కూడా అవుట్ కాలేదు.. కదా ఒమన్ పై (48), ఆస్ట్రేలియాపై (64), శ్రీలంకపై (63) నాటౌట్ నిలిచాడు. ఇలా వరుసగా మూడు మ్యాచుల్లోనే 175 పరుగులు చేశాడు. ఇక్కడ గమనించవల్సిన విషయం ఏమిటంటే, ప్రతి మ్యాచ్లో చివరి వరకు నిలబడి జట్టును విజయానికి దగ్గర చేయడం అతని స్టైల్ అయిపోయింది. అతడి బ్యాటింగ్ స్ట్రైక్ రేటు అద్భుతంగా ఉంది. ఈ గణాంకాలతో మెగా టోర్నీలో బెన్నెట్ అత్యంత స్థిరమైన బ్యాటర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు.
బ్రియాన్ బెన్నెట్ ఆటలో కనిపిస్తున్న పరిపక్వత, ఒత్తిడిలోనూ వికెట్ కాపాడే తీరు, చివరి వరకూ మ్యాచ్ ముగించే ధోరణి భవిష్యత్ స్టార్ గా అతడ్ని నిలబెట్టనున్నాయి. కేవలం రన్స్ మాత్రమే చేయడం కాదు.. మ్యాచ్ పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుని బాధ్యతాయుతంగా ఆడడం కూడా అతని ఎదుగుదలకు దోహదపడుతుందని క్రికెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ వరల్డ్ కప్ బెన్నెట్ ప్రదర్శన జింబాబ్వే జట్టుకు బ్యాక్ బోన్ గా నిలుస్తుంది. అతడు ఇదే ఫామ్ కొనసాగిస్తే టోర్నీలో జింబాబ్వే తదుపరి ఆడే జట్లపై ఈజీగా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ పర్ఫామెన్స్ తో జింబాబ్వే జట్టు సెమీ ఫైనల్ కి చేరినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు.
