టాటా పంచ్ EV కొత్త మోడల్ వచ్చేసింది: తక్కువ ధరలోనే లగ్జరీ ఫీచర్లు.. మధ్యతరగతి వారికి బెస్ట్ ఆప్షన్!

టాటా  పంచ్ EV కొత్త మోడల్ వచ్చేసింది: తక్కువ ధరలోనే లగ్జరీ ఫీచర్లు.. మధ్యతరగతి వారికి బెస్ట్ ఆప్షన్!

టాటా మోటార్స్ ఇండియాలో టాటా పంచ్ EV ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసింది. టాటా  ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ SUVకి ఇది మొదటి అప్ డేట్. ఈ ఫేస్‌లిఫ్ట్ లో సిటీ రోడ్లకు, లాంగ్ జర్నీలకు అనుకూలంగా స్టైలింగ్, లేటెస్ట్ ఫీచర్స్ అందించారు. దీని ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 9.69 లక్షలు. వేరియంట్, బ్యాటరీ కాన్ఫిగరేషన్ బట్టి ధరలు రూ. 9.69 లక్షల నుండి రూ. 12.59 లక్షల (ఎక్స్-షల్) వరకు ఉంటాయి. బుకింగ్‌లు ఓపెన్ అవగా.. డెలివరీలు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ ఆరు వేరియంట్లలో వస్తుంది. 

వేరియంట్
30 kWh బ్యాటరీ – ARAI- క్లెయిమ్ చేసిన పరిధి 365 కి.మీ.
40 kWh బ్యాటరీ – ARAI- క్లెయిమ్ చేసిన పరిధి 468 కి.మీ

40 kWh వేరియంట్‌  129 hp ఉత్పత్తి చేస్తుంది. 0-100 kmph కేవలం 9 సెకన్లలో అందుకుంటుంది.  65 kW DC ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగించి 26 నిమిషాల్లో 20–80% ఛార్జ్ అవుతుంది. 

పంచ్ EV ఫేస్‌లిఫ్ట్  ఫీచర్స్ 
*Y- ఆకారపు LED DRL లు,  
*సెంట్రల్ గా మౌంటెడ్ ఛార్జింగ్ ఫ్లాప్
*కొత్త 16-అంగుళాల ఏరో-ఆప్టిమైజ్డ్ అల్లాయ్ వీల్స్‌,
*వెనుక భాగంలో LED టెయిల్-ల్యాంప్‌
* మూడు కొత్త ఎక్స్టీరియర్ కలర్ అప్షన్స్ 
*కాంట్రాస్టింగ్ బ్లాక్ రూఫ్  
*195 mm గ్రౌండ్ క్లియరెన్స్ 
 *450 mm వాటర్-వేడింగ్ కేపబిలిటీ 


ఇంటీరియర్ 
*10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ 
*10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే 
* వైర్‌లెస్ ఛార్జింగ్ 
*వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు 
* యాంబియంట్ లైటింగ్ 
*కనెక్ట్  కార్ టెక్నాలజీ 
*360-డిగ్రీ కెమెరా


సేఫ్టీ  ఫీచర్స్ 
*ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు,
*ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) 
*హిల్-హోల్డ్ అసిస్ట్
*టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) 
*ISOFIX చైల్డ్-సీట్ మౌంట్‌లు 
*హై బీమ్ అసిస్ట్

సిటీలో తిరగడానికి, అప్పుడప్పుడు లాంగ్ జర్నీలు చేయడానికి తక్కువ ధరలో మంచి ఎలక్ట్రిక్ SUV కావాలనుకునే వారికి 'టాటా పంచ్ EV' ఒక బెస్ట్ ఆప్షన్. ఇది చూడటానికి స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ.