
డైరెక్టర్ వెట్రిమారన్(Vetrimaaran)..ఈ పేరు ఇండియా సినీ ఇండస్ట్రీలో విభిన్నమైన దర్శకుడిగా పేరు పొందిన వ్యక్తి. ఇప్పటిదాకా ఆయన తీసిన సినిమాలన్నీ ఆడియెన్స్‌ని కదిలించే కథలతో వచ్చినవే.అంతేకాదు ఇవన్నీ బ్లాక్‌బస్టర్ హిట్స్ కూడా.
ఆయన రాసిన స్ట్రాంగ్ స్టోరీని, అంతే పవర్‌ఫుల్‌గా స్క్రీన్‌పై ప్రజెంట్ చేయగలిగే దమ్మున్న దర్శకుడతను. అందుకే వెట్రిమారన్ పేరు కోలీవుడ్‌లోనే కాదు..యావత్ దేశంలోనూ ఇంట్రెస్టింగ్ డైరెక్టర్‌గా మారుమ్రోగుతోంది. ఇటీవల వెట్రిమారన్ తెరకెక్కించిన విడుదలై పార్టు-1 బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
తాజా విషయానికి వస్తే..స్టార్ హీరో సూర్య (Suriya), వెట్రిమారన్‌తో వాడివాసల్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా మరోసారి తెరపైకి వచ్చింది. వాడివాసల్ మూవీ షూటింగ్ ఎప్పుడు షురూ అవుతుందనే దానిపై ఆసక్తికర అప్‌డేట్ అందించాడు.
రీసెంట్ గా డైరెక్టర్ వెట్రిమారన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. "ప్రస్తుతం సూరి, విజయ్ సేతుపతి లీడ్ రోల్స్‌లో నటిస్తోన్న విడుదలై పార్టు 2కు సంబంధించి అప్డేట్ ఇచ్చాడు. విడుదలై పార్టు 2 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇంకో 20 రోజుల షెడ్యూల్‌తో షూటింగ్ కంప్లీట్ అవుతుందని..అలాగే వచ్చే మూడు నెలల్లో సూర్య నటించే వాడివాసల్ షూట్ కూడా ప్రారంభిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సూర్య ఫ్యాన్స్ కి వాడివాసల్ సినిమా ఆగిపోలేదని వెట్రిమారన్ ధృవీకరించడంతో సినీ లవర్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
సూర్య సినిమాల విషయానికి వస్తే..
డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ఆకట్టుకునే సూర్య ప్రస్తుతం కంగువ (Kanguva) అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. శివ(Shiva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. దీంతోపాటు సుధాకొంగర దర్శకత్వంలో సూర్య 43లో కూడా నటిస్తున్నాడు. అలాగే డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజుతో సూర్య 44 కూడా లైన్‌లో పెట్టాడు.