కాశీ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు

కాశీ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు

వారణాసిలో ఉన్న కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు చేశారు. రేపు అంటే మే 14వ తేదీ మంగళవారం రోజున  వారణాసి ఎంపీగా మోదీ నామినేషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా మోదీ  కాశీ విశ్వనాథ ఆలయంలో పూజలు చేశారు. అంతకుముందు  వారణాసిలో ఐదు కిలోమీటర్ల మేర ఆయన రోడ్‌షో నిర్వహించారు.  మోదీ రోడ్ షోలో మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, మహేశ్వరి, మార్వాడీ, తమిళం, పంజాబీ తదితర వర్గాల ప్రజలు సంప్రదాయ దుస్తుల్లో ప్రధానికి స్వాగతం పలికారు.  

ప్రధాని మోదీ వెంట ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  పలువురు బీజేపీ నాయకులు ఉన్నారు. కాగా వారణాసి నుంచి మూడోసారి మోదీ పోటీ చేస్తున్నారు. 2014లో మోదీ తొలిసారి వారణాసిలో పోటీ చేసి 56శాతం ఓట్లతో విజయం సాధించి దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు మోదీ.   ఇక 2019 ఎన్నికల్లో  ఆయనకు 63 శాతం ఓట్లు వచ్చాయి.   లోక్‌సభ ఎన్నికల ఏడో దశలో వారణాసిలో జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఏడో దశకు మే 7 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయింది. మే 14 చివరి రోజు.