నేడు ట్రంప్, కిమ్ భేటీ

నేడు ట్రంప్, కిమ్ భేటీ

హనోయి(వియత్నాం ): అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, నార్త్​కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ బుధవారం మరోసారి భేటీ కానున్నారు. వియత్నాంలోని హనోయిలో భేటీ కోసం మంగళవారం సాయంత్రమే ఇరు దేశాధినేతలు ఇక్కడికి చేరుకున్నారు. చుట్టుముట్టిన మీడియాతో మాట్లాడేందుకు ఇరువురూ నిరాకరించారు. అయితే, అంతకుముందు కిమ్​తో భేటీపై ట్రంప్ ట్విట్టర్ లో స్పందించారు. అణ్వాయుధాలను పూర్తిగా వదిలేస్తే ఉత్తర కొరియా అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. న్యూక్లి యర్​వెపన్లను విడిచిపెడితే అభివృద్ధి ఆటోమేటిక్​గా వస్తుందన్నారు. కిమ్​ తెలివైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు.