ఓడిపోతే.. ప్రశాంతగా వైదొలగుతా

ఓడిపోతే.. ప్రశాంతగా వైదొలగుతా
  • నన్ను ఎన్నుకోకుంటే.. దేశానికే చెడు
  • యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ లో తాను ఓడిపోతే ప్రశాంతంగా పదవి నుంచి వైదొలగుతానని ఆ దేశ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆఫీసు నుంచి తనంతట తాను వెళ్లిపోనన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. తనను తిరిగి ప్రెసిడెంట్ గా ఎన్నుకోకపోతే అది దేశానికే చెడ్డ విషయమని ట్రంప్ కామెంట్​ చేశారు. ఫాక్స్ న్యూస్ చానెల్ తో ట్రంప్ మాట్లాడుతూ.. నవంబర్ 3 నాటి ఎన్నికల్లో గెలవకపోతే.. ‘‘ముందుకు పోవాల్సిందే. ఇతర పనులు చేసుకోవాల్సిందే’’ అని అన్నారు. ప్రస్తుత ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ లో రిపబ్లికన్ లీడర్ ట్రంప్ కు డెమొక్రటిక్ క్యాండిడేట్ జో బిడెన్ ప్రత్యర్థిగా నిలవనున్నారు. కరోనా వైరస్ వల్ల అమెరికాపై ప్రభావం తీవ్రంగా ఉండడం, 4 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోవడం, ఎకానమీ నెమ్మదించడం, తాజాగా ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ కస్టోడియల్ కిల్లింగ్ లాంటి పరిణామాల వల్ల ట్రంప్ తిరిగి ఎన్నిక కావడంపై అనుమానాలు వస్తున్నాయి.