మూర్ఖుడు అని పిలిస్తే అస్సలు నచ్చదు..కావాలంటే తెలివైన నియంత అనండి: డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

మూర్ఖుడు అని పిలిస్తే  అస్సలు నచ్చదు..కావాలంటే తెలివైన నియంత అనండి: డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
  • నన్ను డంబ్ అనొద్దు.. తెలివైన నియంత అనండి: ట్రంప్

న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో సంచలనం సృష్టించారు. తనను ఎవరైనా ‘డంబ్’ (మూర్ఖుడు) అని పిలిస్తే అస్సలు సహించలేనని చెప్పారు. కావాలంటే ‘తెలివైన నియంత’ అని పిలుచుకోవచ్చని చెప్పారు. న్యూయార్క్‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. తన మానసిక సామర్థ్యంపై విమర్శలు గుప్పించే వారిపై ఘాటుగా స్పందించారు. ‘విమర్శకులు నన్ను మూర్ఖుడనడం నాకు తీవ్ర బాధ కలిగించింది. అందుకే నా మానసిక దృఢత్వాన్ని నిరూపించుకోవడానికి నేను స్వయంగా కాగ్నిటివ్ టెస్ట్ కు హాజరయ్యాను. అందులో విజయం సాధించాను’ అని పేర్కొన్నారు.