‘ మై లార్డ్’ అనొద్దు

‘ మై లార్డ్’ అనొద్దు
  • యువర్ లార్డ్ షిప్ పదాన్నీ వాడొద్దు
  • రాజస్థాన్ హైకోర్టు కీలక నిర్ణయం

జైపూర్: రాజస్థాన్ హైకోర్టు మంగళవారం కీలకనిర్ణయం ప్రకటించింది. లాయర్లు కేసులను వాదించేటప్పుడు ‘మై లార్డ్’, యువర్ లార్డ్ షిప్’ పదాలను వాడకూడదంటూ హైకోర్టు చీఫ్ జస్టిస్ రవీంద్ర భట్ వాటిపై నిషేధం విధించారు. రెండ్రోజుల కిందట రాజస్థాన్ హైకోర్టు జడ్జీలంతా సమావేశమై ఈ పదాలను సంబోధించటం తప్పకుండా బ్యాన్ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ పదాల వాడకం.. ఇండియన్ కాన్​స్టిట్యూషన్ లోని ‘సమానత్వం ’ ఆదేశానికి అనుగుణంగా లేదని సమావేశం పేర్కొంది.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా బ్రిటిష్ కాలం నాటిచట్టాలు, పాత నియమాలు కొన్నింటిని ఇంకా అనుసరిస్తున్నారని, వాటిని తొలగించాల్సిన అవసరముందని అభిప్రాయ పడింది. సమానత్వం ఆదేశాన్ని అనుసరించేందుకు న్యాయమూర్తులను ‘మై లార్డ్’ , ‘యువర్ లార్డ్ షిప్’ అని సంబోధించకుండా ఉండాలని.. కోర్టుకు హాజరయ్యే వారికి, లాయర్లకు సూచించింది. ‘ఈ తీర్మానం.. లాయర్లు ఆ పదాలను వాడొద్దన్న సూచన మాత్రమే. వాళ్లపై ఎటువంటి నిర్బంధం లేదు. గౌరవ సూచకంగా ఏ పదాన్నైనా వాడొచ్చు’ అని సమావేశంలో పాల్గొన్న జడ్జి ఒకరు అన్నా రు. ఈ నిర్ణయాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్​ రాజస్థాన్ స్వాగతించింది.