ఫేక్ ప్రచారం నమ్మొద్దు.. నీళ్లు ఉన్నయ్ సప్లై చేస్తున్నాం : వాటర్ బోర్డు ఎండీ

ఫేక్ ప్రచారం నమ్మొద్దు.. నీళ్లు ఉన్నయ్ సప్లై చేస్తున్నాం : వాటర్ బోర్డు ఎండీ

హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో కూడా నీళ్ళు అందిస్తున్నామని  వాటర్ బోర్డ్ ఎం. డీ సుదర్శన్ రెడ్డి తెలిపారు. క్షేత్ర స్థాయిలో నీళ్ళు సరిగ్గా అందించకుండా జనాలను ఇబ్బంది గురిచేస్తున్న ముగ్గురు లైన్ మెన్ లను సస్పెండ్ చేశామని.. మరో 7 మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చామని తెలిపారు. సోషల్ మీడియాలో నీళ్ళు లేక సప్లై చెయ్యడం లేదని వదంతులు క్రియేట్ చేస్తున్నారని వాటిని నమోద్దని సూచించారు.

 వాటర్ ట్యాంకర్లతో రోజుకు 7 వేల ట్రిప్స్ ద్వారా నీళ్ళు అందిస్తున్నామని సుదర్శన్ రెడ్డి చెప్పారు. ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల దోపిడీ పై రెవెన్యూ శాఖ దృష్టి సాధించిందని తెలిపారు. నళ్లా కనెక్షన్లు 15 లక్షల ఉంటే..30 వేల కనెక్షన్స్ నుంచి మాత్రమే వాటర్ టాంకర్ బుకింగ్స్ వస్తున్నాయని తెలిపారు. సోషల్ మీడియాలో నీళ్లు లేక ఇబ్బందులు గురవుతున్నారని ఫేక్ ప్రచారం చేస్తున్నారని వాటిని నమ్మొద్దని సూచించారు వాటర్ బోర్డ్ ఎం. డీ సుదర్శన్ రెడ్డి.