- జూన్ 5 వరకు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌కు గడువు
- తక్కువ వెబ్ ఆప్షన్లు ఇచ్చిన 8,137 మందికి సీట్లు అలాట్ కాలే
- నేటి నుంచి మూడో విడత రిజిస్ట్రేషన్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం చేపట్టిన దోస్త్- రెండో విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. మొత్తం 52,302 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. ఇందులో మొదటి విడతలో సీటు వచ్చి, మెరుగైన ఆప్షన్ల కోసం వెళ్లిన వారు 7,737 మంది ఉండగా.. నేరుగా ఫేజ్–2లో సీటు పొందిన వారు 44,565 మంది ఉన్నారు. సీట్లు పొందిన అభ్యర్థుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్ పంపామని, వెబ్‌సైట్ లోనూ వివరాలు చూసుకోవచ్చని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్, దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. తక్కువ వెబ్ ఆప్షన్లు ఇచ్చిన 8,137 మందికి సీట్లు అలాట్ కాలేదు. అయితే, సీట్లు పొందిన వారిలో ఫస్ట్ ఆప్షన్‌కు సంబంధించిన వారే 31,445 మంది ఉన్నారు.
రీయింబర్స్‌మెంట్‌కు అర్హత లేకుంటే ఫీజు
సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 5వ తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని కన్వీనర్తెలిపారు. సర్కారు, వర్సిటీ డిగ్రీ కాలేజీల్లో సీటు వచ్చి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత ఉన్న విద్యార్థులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ప్రైవేట్కాలేజీల్లో సీటు వచ్చి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత ఉన్న విద్యార్థులు రూ.500 ఫీజు, ప్రభుత్వ, వర్సిటీ, ప్రైవేట్కాలేజీల్లో సీటు వచ్చి, రీయింబర్స్‌మెంట్‌కు అర్హత లేనివారు రూ.1,000 ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలని సూచించారు. గడువులోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుంటే సీటు రద్దవుతుందని పేర్కొన్నారు.
జూన్16 వరకు ఫేజ్–3
డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి దోస్త్ మూడో విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభమై జూన్ 16 వరకు కొనసాగనుంది. ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులకు 20న సీట్ల అలాట్మెంట్ ఉంటుంది. మూడు విడతల్లో సీట్లు పొందిన విద్యార్థులందరూ 20 నుంచి 27 మధ్య తమకు కేటాయించిన కాలేజీలకు వెళ్లి నేరుగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఆన్‌లైన్‌లో రిపోర్ట్ చేసిన సీటు కూడా రద్దవుతుంది.
కోర్సుల వారీగా సీట్ల కేటాయింపు వివరాలు..
కామర్స్ లో 21,431, ఫిజికల్ సైన్సెస్ లో 15,245, లైఫ్ సైన్సెస్ లో 9,664, ఆర్ట్స్‌లో 5,955, ఇతర కోర్సుల్లో ఏడుగురికి.. మొత్తం 52,302 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు.
