కొత్త స‌చివాల‌యంలో కొలువుదీరిన సీఎం, మంత్రులు.. ఈ ద‌స్త్రాల‌పైనే తొలి సంత‌కాలు

కొత్త స‌చివాల‌యంలో కొలువుదీరిన సీఎం, మంత్రులు.. ఈ ద‌స్త్రాల‌పైనే తొలి సంత‌కాలు

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స‌చివాల‌యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులంద‌రూ త‌మ ఛాంబ‌ర్లలో కొలువుదీరారు. అనంత‌రం ప‌లు ద‌స్త్రాల‌పై సీఎం కేసీఆర్, మంత్రులు సంత‌కాలు చేశారు.

ఈ ద‌స్త్రాల పైనే.. సీఎం కేసీఆర్ సంతకాలు

1. దళితబంధు పథకం 2023-24 సంవత్సరంలో  అమలుకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్..సచివాలయంలో తొలి సంతకం చేశారు. ఇప్పటికే పూర్తిస్థాయిలో అమలు చేసిన హుజూరాబాద్ మినహా రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి 1100 లబ్ధిదారుల చొప్పున దళితబంధు పథకాన్ని వర్తింపచేయాలనే ఫైలు మీద సీఎం కేసీఆర్ సంతకం చేశారు.

2. పోడు భూముల పట్టాల పంపిణీకి సంబంధించిన ఫైలుపై సీఎం కేసీఆర్ రెండో సంతకం  చేశారు. మే నెల నుంచి జిల్లాల వారీగా పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. దీని ద్వారా 1 లక్షా 35 వేల మంది లబ్ధిదారులకు దాదాపు 3.9 లక్షల ఎకరాలకు సంబంధించి పోడు పట్టాలు అందచేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు.

3. సీఎంఆర్ఎఫ్ నిధులు లబ్ధిదారులకు సంబంధించిన ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు.

4. గర్భిణీలకు పౌష్టికాహారం కోసం అందించే...కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కు సంబంధించిన ఫైలు మీద సీఎం కేసీఆర్ సంతకం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ జరుగనున్నది. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 13.08 లక్షల కిట్స్ పంపిణీ చేయాలని లక్ష్యంగా ఎంచుకున్న నేపథ్యంలో..6.84 లక్షల మంది గర్భిణులు లబ్ధి పొందనున్నారు. ఒక్కో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ విలువ రూ.2 వేలు. ఇందుకుగాను ప్రభుత్వం మొత్తం రూ. 277 కోట్లు ఖర్చు చేయనున్నది.

5. రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కు సంబంధించిన ఫైలు మీద సీఎం కేసీఆర్ సంతకం చేశారు.

6. పాలమూరు లిఫ్టు ఇరిగేషన్ కు సంబంధించిన ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు.

ఈ ద‌స్త్రాల పైనే మంత్రుల మొద‌టి సంత‌కాలు

* సీఎం కేసీఆర్ – కాంట్రాక్ట్ ఉద్యోగుల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ ద‌స్త్రం

* కేటీఆర్ – జీహెచ్ఎంసీ ప‌రిధిలో డబుల్ బెడ్రూంల కేటాయింపు మార్గద‌ర్శకాలు

* హరీష్ రావు – టీచింగ్ ఆసుపత్రుల్లో 1827 స్టాఫ్ న‌ర్సుల‌ డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ ద‌స్త్రం

* తలసాని శ్రీనివాస్ యాదవ్ – ఉచిత చేప పిల్లలు, గొర్రెల పంపిణీ ద‌స్త్రం

* నిరంజన్ రెడ్డి – సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు సరఫరా ద‌స్త్రం

* గంగుల కమలాకర్ – ఐసీడీఎస్ పథకంలో భాగంగా అంగన్‌వాడీల‌కు మే నెల నుంచి పోషకాల సన్నబియ్యం అందించే ద‌స్త్రం

* కొప్పుల ఈశ్వర్ – దళిత బంధు రెండో విడత ద‌స్త్రం

* ఇంద్రకరణ్ రెడ్డి – జీహెచ్ఎంసీ పరిధిలోని దేవాలయాల్లో దూపదీప నైవేద్య ప్రారంభం ద‌స్త్రం

* జ‌గ‌దీశ్ రెడ్డి – వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ ద‌స్త్రం

* స‌బితా ఇంద్రారెడ్డి – ట్యాబ్‌లు, లైబ్రరీ కార్నర్ ద‌స్త్రం

* స‌త్యవ‌తి రాథోడ్ – రాంజీ గోండు మ్యూజియానికి రూ. 10 కోట్ల కేటాయింపు ద‌స్త్రం

* శ్రీనివాస్ గౌడ్ – సీఎం క‌ప్ నిర్వ‌హ‌ణ‌కు రూ. 3.2 కోట్ల మంజూరు ద‌స్త్రం

*పువ్వాడ అజయ్‌ –  ఆర్టీసీ ఆన్‌లైన్‌ సేవల విస్తరణ

* మహమూద్ అలీ – కొత్త పోలీస్ స్టేషన్ల మంజూరు ద‌స్త్రం

* వేముల ప్రశాంత్ రెడ్డి – రోడ్లు భవనాల శాఖ పునర్వ్యవస్థీకరణ ద‌స్త్రం

* మల్లారెడ్డి – శ్రమ శక్తి అవార్డుల ద‌స్త్రం

* దయాకర్ రావు – ఐకేపీ గ్రూపులకు మండలాల వారీగా కొత్త భవనాల ద‌స్త్రం