ముషీరాబాద్, వెలుగు: చిక్కడపల్లిలో హోమియోపతి డాక్టర్ దండేపు బసవ నందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈశ్వరప్ప హోమియోపతి హాస్పిటల్ నూతన భవనాన్ని రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హోమియోపతి వైద్యం ద్వారా సర్వరోగ నివారణకు డాక్టర్ బసవ నందం చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని కొనియాడారు.
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్, బీఆర్ఎస్ నాయకుడు ముఠా జై సింహ, ప్రభుత్వ హోమియోపతి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ లింగరాజు, పాల్గొన్నారు.
