వెయ్యి రోజుల పాలనపై నిరసనలు సరికాదు..బీఆర్ఎస్ పై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫైర్

వెయ్యి రోజుల పాలనపై నిరసనలు సరికాదు..బీఆర్ఎస్ పై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫైర్

హైదరాబాద్, వెలుగు: వెయ్యి రోజుల పాలనపై నిరసనలు చేయడం కాదు.. ముందు మీ పదేళ్ల పాలనపై క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాయాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు. సోమవారం ఆయన సీఎల్పీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. అధికారం పోయిందన్న అసహనంతో బీఆర్‌‌‌‌ఎస్ నేతలు తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వెయ్యి రోజుల పాలనపై తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఈ పాలనపై ఎవరైనా బాధపడుతున్నారంటే అది ఒక్క బీఆర్ఎస్ మాత్రమేనని ఆరోపించారు.

వెయ్యి రోజుల వంటి పాలన మరో పదివేల రోజులు ఉండాలని రాష్ట్ర ప్రజలు  కోరుకుంటున్నారని, సీఎంగా రేవంత్ రెడ్డి పనితీరుపై ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. బీఆర్ఎస్ కు  చెందిన ఆ నలుగురు తోడేళ్లు మాత్రమే మళ్లీ అధికారంలోకి రాలేమనే అక్కసుతో కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని, అయినా తెలంగాణ ప్రజలు వారి మాటలను నమ్మే పరిస్థితుల్లో లేరని, మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ మాత్రమేనని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్పష్టం చేశారు.