శ్రీ రంగాచార్యకు తెలుగు వర్సిటీ పురస్కారం

శ్రీ రంగాచార్యకు తెలుగు వర్సిటీ  పురస్కారం
  • వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా డిసెంబర్‌ 2న అందజేత

హైదరాబాద్, వెలుగు : తెలుగు భాషా సాహిత్య, సంస్కృతికి విశిష్ట సేవ చేసిన డాక్టర్ శ్రీరంగాచార్యకు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ విశిష్ట పురస్కారాన్ని ప్రకటించింది. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్‌ కోట్ల హనుమంతరావు సోమవారం ఒక ప్రకటన రిలీజ్ చేశారు. 

నల్గొండ జిల్లా చందుపట్ల గ్రామంలో 1943లో జన్మించిన శ్రీరంగాచార్య ఓరియంటల్ కాలేజీలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. ఆయన సేవలకుగానూ తెలుగు వర్సిటీ విశిష్ట పురస్కారం ప్రకటించింది. కాగా, డిసెంబర్ 2న వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు.