మూసీ బ్యూటిఫికేషన్ కు నాలుగు నెలల్లో మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

మూసీ బ్యూటిఫికేషన్ కు  నాలుగు నెలల్లో మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

 మూసీ నది డెవలప్​మెంట్, బ్యూటిఫికేషన్​పై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్​పెట్టింది. ఉన్నతాధికారులతో నిర్వహిస్తున్న సమావేశాల్లో హైదరాబాద్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి సీఎం రేవంత్ రెడ్డి ముందుగా మూసీ బ్యూటిఫికేషన్ పైనే మాట్లాడుతున్నారు. పనులను వేగవంతం చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు

మూసీ రివర్ ను పబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్లాన్ రూపొందించారు. దీనిపై ఇటీవల ఎంఆర్డీసీఎల్ 24వ బోర్డు భేటీ అయింది. ఆగస్టు నెలాఖరులోగా మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రాఫ్ట్ సిద్ధం కానుంది. 

మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టు మొదటి దశలో ఉస్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్ట్రీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి గౌరెల్లి సమీపంలోని ఔటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్డు వరకు, హిమాయత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్ట్రీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి బాపూఘాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని సంఘం వరకు 55 కిలోమీటర్ల మేర విస్తరణ, అభివృద్ధి చేపట్టాలని అధికారులు ప్రతిపాదించారు. మూసీ చుట్టూ ఉన్న వారసత్వ కట్టడాల పరిరక్షణ, పునరుద్ధరణ చేయాలని నిర్ణయించారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా, నది పరివాహక ప్రాంత ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా చర్యలు చేపట్టనున్నారు.