V6 News

మైదానంలోకి అడుగు పెట్టిన కొత్త కెప్టెన్, కొత్త కోచ్

మైదానంలోకి అడుగు పెట్టిన కొత్త కెప్టెన్, కొత్త కోచ్

టీమిండియా కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్ టీంతో జాయిన్ అయ్యాడు.    న్యూజిలాండ్ తో జైపూర్ లో బుధవారం జరగనున్న తొలి టీ20 మ్యాచ్ కోసం టీమిండియా ప్రాక్టీస్ చేసింది. కోచ్ గా రాహుల్ ద్రవిడ్,పూర్తి స్థాయి కెప్టెన్ గా రోహిత్ శర్మకు రేపు జరగనున్న టీ20 మ్యాచ్ ఫస్ట్ ది . దీంతో ఎలాగైనా విజయంతో స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు ఇద్దరు. ఈ నేపథ్యంలోనే జైపూర్ లో పిచ్ ను పరిశీలించాడు కోచ్ ద్రవిడ్. మ్యాచ్ ఫలితాన్ని తేల్చడంలో పిచ్ కీలకం. అలాగే ప్రాక్టీస్ సెషన్ లో కెప్టెన్ రోహిత్, కేఎల్ రాహుల్ కు ద్రవిడ్ కొన్ని బాల్స్ త్రో వేశాడు ద్రవిడ్.  యువ క్రికెటకర్లకు పలు సూచనలు చేశాడు. బీసీసీఐ ఈ వీడియోను ట్వీట్టర్లో పోస్ట్ చేసింది. రేపు జరగనున్న టీ20 మ్యాచ్ లో రోహిత్, కేఎల్ రాహుల్ మినహా మిగతా వాళ్లంత యంగ్ ప్లేయర్లే. కొహ్లీకి విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే.