కర్నూలులో మిసైల్​ టెస్ట్​ సక్సెస్

కర్నూలులో మిసైల్​ టెస్ట్​ సక్సెస్
  •     ఓర్వకల్లు ​టెస్టింగ్​ రేంజ్​లో డీఆర్​డీవో ప్రయోగం
  •     సైంటిస్టుల్ని అభినందించిన డిఫెన్స్​ మంత్రి రాజ్​నాథ్

కర్నూలు, వెలుగు: ఆర్మీ ఆయుధ సంపత్తిని మరింత బలోపేతం చేస్తూ డిఫెన్స్​ రీసెర్చ్​ అండ్ డెవలప్​మెంట్ ఆర్గనైజేషన్​(డీఆర్​డీవో) రూపొందించిన మూడోతరం యాంటీ ట్యాంక్​ గైడెడ్​ మిస్సైల్​ను బుధవారం కర్నూలు జిల్లాలో సక్సెస్​ఫుల్​గా ప్రయోగించారు. జిల్లాలోని ఓర్వకల్లు మండల పరిధిలోని మిస్సైల్​ టెస్టింగ్​ రేంజ్​లో డీఆర్​డీవో సైంటిస్టులు ఈ ప్రయోగాన్ని చేపట్టారు. (మనుషులు సులువుగా మోసుకెళ్లగలిగే) మ్యాన్​ పోర్టబుల్​ యాంటీ గైడెడ్​ మిస్సైల్​(ఎంపీఏటీజీఎం) ద్వారా ఓ లైవ్​ ట్యాంకర్​ను ధ్వంసం చేశారు. మ్యాన్​ పోర్టబుల్​ ట్రైపాడ్​ లాంచర్​ ద్వారా  ఫైర్​ అండ్​ ఫర్గెట్​ మిస్సైల్​ను విజయవంతంగా ప్రయోగించడం ఇది మూడోసారని, ఆర్మీకి సంబంధించి ఇదొక గొప్ప ముందడుగని డిఫెన్​ మినిస్ట్రీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయోగాన్ని సక్సెస్​ చేసిన డీఆర్​డీవో సైంటిస్టులకు డిఫెన్స్ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ అభినందనలు తెలిపారు. యాంటీ ట్యాంక్​ మిస్సైల్స్​లో ఎంపీఏటీజీఎంను థార్డ్​ జనరేషన్​ మిస్సైల్​గా భావిస్తారు. 2.5కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి ట్యాంకర్​నైనాసరే ఇది తునాతునకలు చేస్తుంది. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో డీఆర్​డీవో రూపొందించిన ఈ మిస్సైళ్లను 2021 నాటికి ఆర్మీకి అందజేస్తారు.