రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది ముగిసింది. హకీంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రపతికి మంత్రులు, అధికారులు వీడ్కోలు పలికారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 26వ తేదీన హైదరాబాద్ కు వచ్చారు. నాలుగు రోజుల పాటు బిజీగా గడిపారు. బొల్లారంలోని యుద్ధ స్మారకం దగ్గర నివాళులర్పించారు. డిసెంబర్ 27న నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థను విజిట్ చేశారు. విద్యార్థులు, ఫ్యాకల్టీతో సమావేశమయ్యారు.
డిసెంబర్ 28న భద్రాచలం సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. ప్రసాద్ పథకాన్ని ప్రారంభించారు. వరంగల్ లోని రామప్ప ఆలయాన్ని దర్శించారు. నిన్న నారాయణమ్మ కాలేజ్ ను విజిట్ చేశారు. ఆ తర్వాత ముచ్చింతల్ లోని రామానుజాచార్య విగ్రహాన్ని సందర్శించారు. ఇవాళ ఉదయం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని రాష్ట్రపతి ముర్ము దర్శించుకున్నారు . మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న ముర్ము.. 3గంటల 40 నిమిషాలకు హకీంపేట నుంచి ఢిల్లీ పయనమయ్యారు.

