8 మంది సాయంతో డ్రగ్స్ విక్రయిస్తున్న లక్ష్మీపతి

8 మంది సాయంతో డ్రగ్స్ విక్రయిస్తున్న లక్ష్మీపతి

బీటెక్ విద్యార్థి మృతి కేసులో కీలక నిందితుడైన డ్రగ్ పెడ్లర్ లక్ష్మీపతి వద్ద  80 నుంచి100 మంది కస్టమర్లు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయాన్ని డీసీపీ గుమ్మి చక్రవర్తి ప్రకటించారు. లక్ష్మీపతిపై నల్లకుంట, ఆఫ్జల్ గంజ్, గోల్కొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆరు కేసులు ఉన్నట్లు చెప్పారు. నిందితుని నుంచి 840 గ్రాముల హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. డ్రగ్స్ విక్రయించేందుకు అతను మరో 8 మంది సాయం తీసుకుంటున్నట్లు గుర్తించారు. 

మరోవైపు లక్ష్మీపతి.. నగేష్ అనే వ్యక్తి నుంచి  హ్యాష్ ఆయిల్ కొనుగోలు చేసినట్లు డీసీపీ గుమ్మి చక్రవర్తి వెల్లడించారు. అరకు ప్రాంతానికి చెందిన నగేష్  అక్కడ హ్యాష్ ఆయిల్ తయారు చేసి ఒడిశా, తమిళనాడు, ఢిల్లీ, కర్నాటక, కేరళ, ముంబై, యూపీ, బీహార్ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. డ్రగ్స్కు అలవాటుపడటంతో నగేశ్ను 2016 నుంచి అతని కుటుంబ సభ్యులు దూరం పెట్టారు. తెలంగాణలో అతని కింద 8 మంది డ్రగ్ పెడ్లర్లు పనిచేస్తున్నట్లు డీసీపీ వెల్లడించారు.

For more news..

షాంఘైలో కరోనా కలకలం.. లాక్డౌన్ పెట్టినా తగ్గని కేసులు

పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన ఎంఐఎం కార్పొరేటర్ అరెస్ట్