ఓయో రూం నుంచి డ్రగ్స్.. ముంబై ముఠా అరెస్ట్

ఓయో రూం నుంచి డ్రగ్స్.. ముంబై ముఠా అరెస్ట్

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. మాదక ద్రవ్యాల్ని  భారీగా పట్టుకున్నారు. దీంతో ముంబై మాఫియాని  నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.  ముంబై నుంచి ఈ ముఠా  హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు తెలిపారు. హైదరాబాదులోని న్యూ ఇయర్ వేడుకల కోసం ముఠా డ్రగ్స్ తీసుకొచ్చినట్లు తెలిపారు.  కొకైన్ తో  పాటు ఇతర మత్తు మందులను జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. డ్రగ్స్ కేసుకు సంబంధించిన వివరాల్ని సీపీ  సీవీ. ఆనంద్ మీడియాకు వివరించారు. నార్కోటిక్ డ్రగ్స్ పై తెలంగాణా పోలీస్ ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ కూడా డ్రగ్స్ ముఠాలు పై కన్నేసి ఉంచాలని ఆదేశించామన్నారు. న్యూ ఇయర్ వేడుకల హైదరాబాద్ కు డ్రగ్స్ ను తెచ్చిన మూడు ముఠాలు ను అరెస్ట్ చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు. 

మూడు ముఠాల్లో 7 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. ముంబైకి చెందిన ముఠా నుండి కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. ప్రధాన నిందితుడు ఇబ్రాన్ బాబు షేక్, నూర్ మహ్మద్ ఖాన్ ఏపీ తెలంగాణ లో డ్రగ్స్ విక్రయించడానికి నియమించుకున్నారన్నారు. ఈ ఇద్దరి నుండి 100 గ్రాముల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ డ్రగ్స్ దందా అంత ఒయో కేంద్రంగా నడిచిందన్నారు. కష్టమర్లకు ఈ డ్రగ్స్ ను ఒయో రూమ్ నుండి సప్లై చేస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. ఒక్కో గ్రాము 10 వేల రూపాయలకు అమ్మకాలు చేస్తున్నారని సీవీ ఆనంద్ తెలిపారు. డ్రగ్స్ అమ్మిన వ్యక్తి తో పాటు కొనుగోలు చేస్తున్న వ్యక్తులు పై కూడా కేసులు పెడతామన్నారు పోలీసులు. 

సెక్షన్ 27 ప్రకారం డ్రగ్స్ వాడే వారిపై కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేస్తామంటున్నారు. ఈ డ్రగ్స్ ముఠాలతో అన్ని రకాల సెక్టార్ వాళ్ళు టచ్ లో ఉన్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. ఈ డ్రగ్స్ ముఠా కింగ్ పిన్ టోనీ గా గుర్తించామన్నారు. మహారాష్ట్ర పోలిస్ సహాయంతో టోనీ ని అరెస్ట్ చేసి తీరుతామంటున్నారు హైదరాబాద్ పోలీసులు. డ్రగ్స్ గ్యాంగ్ స్టార్ టోనీ దేశ వ్యాప్తంగా డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నట్లు తెలిసిందన్నారు. హైదరాబాద్ లో కోవిడ్ పరిస్థితుల కారణంగ కార్డెన్ సెర్చ్ నిలిపివేశారు పోలీసులు. అయితే త్వరలోనే కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ మొదలు పెడుతామంటున్నాకగ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. 

ఇవి కూడా చదవండి:

రాష్ట్రంలో భారీగా పెరిగిన కరోనా కేసులు

ఆర్‌‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌‌ ఫొటో మార్ఫింగ్