ఓనంకి వస్తున్న  కింగ్

ఓనంకి వస్తున్న  కింగ్

దుల్కర్ సల్మాన్ హీరోగా అభిలాష్ జోషి రూపొందిస్తున్న చిత్రం ‘కింగ్ ఆఫ్‌‌ కోత’. ఇదొక గ్యాంగ్‌‌స్టర్ డ్రామా. శుక్రవారం ఈ మూవీ రిలీజ్ అప్‌‌డేట్ ఇచ్చారు మేకర్స్. కేరళలో పెద్ద పండుగ అయిన ‘ఓనం’ సందర్భంగా ఆగస్టులో రిలీజ్ చేస్తామన్నారు. ఇందులో దుల్కర్‌‌‌‌ పోలీస్ ఆఫీసర్‌‌‌‌గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. దుల్కర్ హోమ్ బ్యానర్ వేఫేరర్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం తమిళనాడులోని కరైకుడిలో షూటింగ్ జరుగుతోంది. జేక్స్ బిజోయ్ , షాన్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.