పండగ నెలలో ఆన్‌‌‌‌‌‌‌‌‌‌లైన్ సేల్స్ భారీగా పెరిగే ఛాన్స్

పండగ నెలలో ఆన్‌‌‌‌‌‌‌‌‌‌లైన్ సేల్స్ భారీగా పెరిగే ఛాన్స్

న్యూఢిల్లీ: ఈ ఏడాది పండగ నెలలో ఆన్‌‌‌‌‌‌‌‌‌‌లైన్ సేల్స్ భారీగా పెరుగుతాయని ఈ–కామర్స్ కంపెనీలు లెక్కలేసుకుంటున్నాయి. సాధారణంగా ఈ–కామర్స్ కంపెనీలు మొదలు పెట్టిన మొదటి సేల్స్ ఈవెంట్‌‌‌‌ నుంచి దిపావళి వారం వరకు  ఉన్న టైమ్‌‌‌‌ పీరియడ్‌‌‌‌ను ఫెస్టివ్ నెలగా పిలుస్తున్నారు. కిందటేడాది ఫెస్టివ్ నెలతో పోలిస్తే ఈ ఏడాది ఆన్‌‌‌‌లైన్ సేల్స్‌‌‌‌ 28 % పెరుగుతాయని, అమ్మకాల విలువ 11.8 బిలియన్ డాలర్ల (రూ. 94,400 కోట్ల) కు చేరుకుంటుందని రెడ్సీర్ ఓ రిపోర్ట్‌‌‌‌లో పేర్కొంది.

 2018 తో పోలిస్తే ప్రస్తుతం ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో షాపింగ్ చేసేవాళ్లు రెండింతలు పెరిగారని, అందుకే సేల్స్ కూడా భారీగా పెరుతాయని ఈ రిపోర్ట్ అంచనావేసింది. ఈ ఏడాది ఫెస్టివ్ నెల మొదటి వారంలోనే 5.9 బిలియన్ డాలర్ల విలువైన సేల్స్ జరుగుతాయని, కిందటేడాది ఇదే టైమ్‌‌‌‌ పీరియడ్‌‌‌‌లో జరిగిన సేల్స్‌‌‌‌ 4.8 బిలియన్ డాలర్ల కంటే ఇది 28 % ఎక్కువని రెడ్‌‌‌‌సీర్ రిపోర్ట్ వెల్లడించింది.  టైర్‌‌‌‌‌‌‌‌ 2 సిటీల నుంచి ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో షాపింగ్ చేసేవాళ్లు పెరగడంతో ఫ్యాషన్ కేటగిరీలో ఎక్కువ సేల్స్ జరుగుతాయని అంచనావేసింది. మొబైల్‌‌‌‌, ఎలక్ట్రానిక్స్ కేటగిరీలోనూ సేల్స్ పెరుగుతాయని తెలిపింది.  2018 తో పోలిస్తే  ప్రస్తుతం ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో షాపింగ్ చేసేవాళ్లు 4 రెట్లు ఎక్కువ పెరిగారని, ఫెస్టివ్ సీజన్‌‌‌‌లో షాపింగ్ చేసేవాళ్లు డబుల్ అయ్యారని  వివరించింది.