
కాంగ్రెస్ సీనియర్లకు ఎన్నికల బాధ్యతలు
ఒక్కొక్కరికి ఐదు నియోజకవర్గాలు అప్పగింత
సీడబ్ల్యూసీ సమావేశాలు, సభలు, ప్రచార కార్యక్రమాలు వారికే
విజయభేరి సభకు కో ఆర్డినేటర్లను నియమించిన పీసీసీ
హైదరాబాద్, వెలుగు: సీనియర్ నేతలకు కాంగ్రెస్ పార్టీ కీలకమైన ఎన్నికల బాధ్యతలను అప్పగించింది. రాష్ట్రంలో త్వరలో జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశాలు, విజయభేరి సభ, తిరగబడదాం తరిమికొడదాం, ఎన్నికల కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించి ఒక్కొక్కరికి ఐదు నియోజకవర్గాల చొప్పున బాధ్యతలను అప్పగిస్తూ మంగళవారం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదేశాలిచ్చారు. దాంతో పాటు నియోజకవర్గాల వారీగా మండల కమిటీ అధ్యక్షులకూ ప్రచార కార్యక్రమాల బాధ్యతలను పార్టీ అప్పగించింది. మరోవైపు విజయభేరి సభకు నియోజకవర్గాల వారీగా 119 మంది కోఆర్డినేటర్లను పార్టీ నియమించింది.
సీనియర్లకు అప్పగించిన నియోజకవర్గాలు
రేవంత్ రెడ్డి: కొడంగల్, నారాయణపేట, దేవరకద్ర, కల్వకుర్తి, జడ్చర్ల
భట్టి విక్రమార్క: మధిర, ఇల్లందు, వైరా, పినపాక, కొత్తగూడెం
ఉత్తమ్ కుమార్ రెడ్డి: కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ, దేవరకొండ, సూర్యాపేట
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి: నల్గొండ, భువనగిరి, జనగామ, మునుగోడు, తుంగతుర్తి
జగ్గారెడ్డి: సంగారెడ్డి, పటాన్చెరు, శేరిలింగంపల్లి, నారాయణ్‌ఖేడ్, గోషామహల్
జీవన్ రెడ్డి: జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, రామగుండం, వేములవాడ
శ్రీధర్ బాబు: మంతని, పెద్దపల్లి, సిరిసిల్ల, చొప్పదండి, మానకొండూరు
సీతక్క: ములుగు, పరకాల, వరంగల్ ఈస్ట్, భూపాలపల్లి, డోర్నకల్
దామోదర రాజనర్సింహ: ఆందోల్, దుబ్బాక, నర్సాపూర్, నారాయణఖేడ్, మెదక్
జానా రెడ్డి: నాగార్జున సాగర్, నకిరేకల్, మిర్యాలగూడ, భువనగిరి
షబ్బీర్ అలీ: కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ, చాంద్రాయణగుట్ట
పొన్నాల లక్ష్మయ్య: హనుమకొండ, సిద్దిపేట, గజ్వేల్, కరీంనగర్, స్టేషన్ ఘన్పూర్
వీహెచ్: సత్తుపల్లి, అంబర్‌పేట, పాలేరు, ఆలేరు, హుస్నాబాద్
రేణుకా చౌదరి: మేడ్చల్, మల్కాజిగిరి, ఖుత్బుల్లాపూర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్
బలరాం నాయక్: మహబూబాబాద్, నర్సంపేట, వర్ధన్నపేట, అశ్వారావుపేట
సంపత్ కుమార్: గద్వాల, అచ్చంపేట, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, మక్తల్
చిన్నారెడ్డి: వనపర్తి, వికారాబాద్, పరిగి, తాండూరు, చేవెళ్ల
అంజన్ కుమార్ యాదవ్: సికింద్రాబాద్, ముషీరాబాద్, సనత్‌నగర్, నాంపల్లి, జూబ్లీహిల్స్
మహ్మద్ అజారుద్దీన్: బహదూర్‌పుర, చార్మినార్, రాజేంద్రనగర్, యాకుత్‌పుర, కార్వాన్