జయ శంకర్ భూపాల పల్లి ఐడీఓసీ ఆఫీస్లో ప్రజావాణి విన్నపాల వెల్లువ

జయ శంకర్ భూపాల పల్లి ఐడీఓసీ ఆఫీస్లో ప్రజావాణి విన్నపాల వెల్లువ

ములుగు/ భూపాలపల్లి రూరల్/ జనగామ అర్బన్/ కాశీబుగ్గ (కార్పొరేషన్)​, వెలుగు: ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. సోమవారం జయశంకర్​ భూపాలపల్లి ఐడీఓసీ ఆఫీస్​లో నిర్వహించిన గ్రీవెన్స్​లో కలెక్టర్​ రాహుల్​శర్మ ప్రజల నుంచి 70 అర్జీలను స్వీకరించినట్లు చెప్పారు. జనగామలో కలెక్టర్​ సందీప్​కుమార్​ ఝా అడిషనల్​ కలెక్టర్​ బెన్​షాలోమ్​తో కలిసి ఫిర్యాదులు స్వీకరించగా, వివిధ సమస్యలపై 232 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ములుగు గ్రీవెన్స్​లో 96 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్​ దివాకర పేర్కొన్నారు. 

గ్రీవెన్స్​ అనంతరం ఆయన హెచ్​పీ గ్యాస్​ గోదాంను తనిఖీ చేసి, సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. వరంగల్​ ప్రజావాణిలో 165 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్​ సత్యశారద చెప్పారు. గ్రేటర్​ వరంగల్​ మున్సిపల్​ కార్పొరేషన్​లో నిర్వహించిన గ్రీవెన్స్​కు 70 ఫిర్యాదులు అందాయని అడిషనల్​ కమిషనర్​ చంద్రశేఖర్​ పేర్కొన్నారు.