తెలంగాణలో సింథటిక్ డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ తయారీ ముఠా గుట్టురట్టు

తెలంగాణలో సింథటిక్ డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ తయారీ ముఠా గుట్టురట్టు
  •     మొత్తం 14 మంది అరెస్ట్.. పరారీలో మరో 13 మంది  

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ రవాణా మూలాలను ఛేదించే క్రమంలో ఈగల్‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌‌‌‌‌ పురోగతి సాధించింది. తెలంగాణతోపాటు మహారాష్ట్రలో విస్తరించిన అంతర్రాష్ట్ర సింథటిక్‌‌‌‌‌‌‌‌ డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ తయారీ, సరఫరా నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ను గుర్తించింది. మహారాష్ట్రలోని గోండియా జిల్లా మరేగావ్‌‌‌‌‌‌‌‌ గ్రామంలోని ఓ పౌల్ట్రీ ఫామ్‌‌‌‌‌‌‌‌లో నిర్వహిస్తున్న డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ తయారీ కేంద్రాన్ని గుర్తించింది. ఈ నెల 17న ఈగల్‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌‌‌‌‌ నిర్వహించిన ఆపరేషన్‌‌‌‌‌‌‌‌లో ముగ్గురిని అరెస్ట్ ​చేసినట్టు ఈగల్‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌‌‌‌‌ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 

ఈ ఏడాది ఆగస్టు 8న బీబీనగర్‌‌‌‌‌‌‌‌ పోలీసులు కొండమడుగు నుంచి నాగ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ వైపు వెళ్తున్న వాహనంలో 27.2 కిలోల మెఫెడ్రోన్‌‌‌‌‌‌‌‌తోపాటు 56.98 కిలోల అసిటోన్‌‌‌‌‌‌‌‌ను స్వాధీనం చేసుకుని 11 మందిని అరెస్ట్​చేశారు. దర్యాప్తులో భాగంగా ఈ నెల 17న ఈగల్‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌‌‌‌‌ బృందం మహారాష్ట్రలోని మరేగావ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న పౌల్ట్రీ ఫామ్‌‌‌‌‌‌‌‌లో ల్యాబ్​ను గుర్తించింది. ఈ కేసుతో సంబంధమున్న 13 మంది పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు కొనసాగుతోందని పేర్కొంది.