
హైదరాబాద్, వెలుగు: ఇంటర్ ఫలితాల్లోగందరగోళం నేపథ్యంలో ఎంసెట్ ఫలితాల గురించి విద్యార్థులు ఆందోళన చెందవద్దని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి శుక్రవారం సూచించారు. ఇంటర్ ఫలితాల్లో రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ పూర్తయ్యాకే ఎంసెట్ ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఎంసెట్ లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఉండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, దీంతో ఎంసెట్ కన్వీనర్ తో మాట్లాడి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.