ఎంసెట్ సెకండ్ పేస్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

ఎంసెట్ సెకండ్ పేస్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

ఎంసెట్ ఇంజనీరింగ్ సెకండ్ పేస్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను విడుదల చేసింది సాంకేతిక విద్యాశాఖ. ఈ నెల 25 నుండి తుది విడత అడ్మిషన్స్ కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిపింది. నవంబర్ 2న సీట్లను కేటాయించనున్నారు. సీట్ల రద్దు కు నవంబర్ 7 వరకు అవకాశం కల్పించారు. నవంబర్ 6 వరకు ఆన్లైన్ లో రిపోర్టింగ్  చేయాల్సి ఉంటుంది. నవంబర్ 9 నుండి స్పెషల్ రౌండ్ అడ్మిషన్స్ కౌన్సెలింగ్ చేపట్టి..నవంబర్ 12 న సీట్లను కేటాయిస్తారు. నవంబర్ 15 లోపు సీటు పొందిన విద్యార్థులు సంబంధిత కాలేజి లో ఆన్లైన్ రిపోర్ట్ చేయాలని తెలిపింది సాంకేతిక విద్యాశాఖ అధికారులు.