ఇంగ్లండ్: భారత్‌లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్, వీక్షకుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఈసీబీ 3 టీ20 మ్యాచ్‌ల టైమింగ్‌ను ముందుకు జరిపింది. షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్‌లు స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు) ప్రారంభం కావాల్సి ఉంది.
అయితే ఇంత లేట్ నైట్ అయితే భారత ప్రేక్షకులు మ్యాచ్‌లు చూసే అవకాశం తగ్గుతుందని భావించిన బోర్డు.. బ్రాడ్ కాస్టర్లు అయిన స్కై స్పోర్ట్స్, సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లతో చర్చలు జరిపింది. అనంతరం మ్యాచ్‌లను గంట ముందుగా, అంటే స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు) మార్చింది. జూలై 1 నుంచి 19 వరకు జరిగే ఈ పర్యటనలో భారత్ 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది.
