- హైదరాబాద్, ఏపీలోని ఐదు ప్రాంతాల్లో ఈడీ సోదాలు
- రూ.9 లక్షలు నగదు, రేంజ్ రోవర్ కార్, మొబైల్ ఫోన్ సీజ్
హైదరాబాద్, వెలుగు: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డితోపాటు మరో నిందితుడు దొంతిరెడ్డి వాసుదేవరెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం అరెస్ట్ చేసింది. దర్యాప్తులో భాగంగా ఏపీ సహా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.
రాజ్ కసిరెడ్డి నివాసంతోపాటు విజయనర్సింహారెడ్డి, వల్లు సందీప్, ఏపీ మాజీ మంత్రి కరుమురి నాగేశ్వరరావు, కరుమూరి సునీల్‌కుమార్ ఇండ్లలో సోదాలు చేసింది. ఈ దాడుల్లో వల్లు సందీస్ నివాసంలో రూ.9 లక్షలు నగదు, నాగేశ్వర్, సునీల్‌కుమార్ ఇండ్లలో రెండు రోలెక్స్ వాచీలు, రేంజ్ రోవర్ కారు, హవాలా లావాదేవీలకు సంబంధించి చాటింగ్స్, పిక్చర్స్ కలిగి ఉన్న మొబైల్ ఫోన్, జాయింట్ వెంచర్స్ అగ్రిమెంట్లను సీజ్ చేసింది. ఈ కేసులో రూ.195.33 కోట్లు మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ గుర్తించింది.
