నీరవ్ మోడీ 11 కార్లు, 173 పెయింటింగ్స్ వేలం

నీరవ్ మోడీ 11 కార్లు, 173 పెయింటింగ్స్ వేలం

బ్యాంకులకు బాకీలు చెల్లించకుండా పరారీలో ఉన్న భారతీయ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని లండన్ లోని హోల్ బార్న్ మెట్రో స్టేషన్ లో అరెస్ట్ చేశారు యూకే పోలీసులు. భారత్ ఇచ్చిన ఆధారాలతో ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. నేరస్తుల అప్పగింత ఒప్పందంలో భాగంగా నీరవ్ మోడీని ఆ తర్వాత భారత్ కు అప్పగించనున్నారు.

అదే సమయంలో… నీరవ్ మోడీ ఆస్తుల వేలానికి న్యాయపరమైన అనుమతులు పొందింది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్టే. ముంబైలోని ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసులు విచారణ చేసే న్యాయస్థానంలో తన వాదనలు వినిపించిన ఈడీ … నీరవ్ ఆస్తుల జప్తుకు, వేలానికి పర్మిషన్స్ పొందింది.

నీరవ్ మోడీకి చెందిన 11 లగ్జరీ కార్లు, 173 అత్యంత ఖరీదైన పెయింటింగ్స్ ను వేలానికి పెట్టేందుకు అనుమతులు పొందింది ఈడీ. వీటిని వేలం వేసి… బాధిత పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇతర బ్యాంకులకు అప్పగించనుంది.