స్కూళ్లలో బాధ్యత సినిమా ప్రదర్శనకు అనుమతి :  డైరెక్టర్ నవీన్ నికోలస్

స్కూళ్లలో బాధ్యత సినిమా ప్రదర్శనకు అనుమతి :  డైరెక్టర్ నవీన్ నికోలస్

హైదరాబాద్,వెలుగు: రాష్ట్రంలోని స్కూల్ స్టూడెంట్లకు సామాజిక స్పృహ, నైతిక విలువలు నేర్పించేందుకు విద్యాశాఖ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ‘బాధ్యత’ అనే సందేశాత్మక సినిమాను అన్ని జిల్లాల్లోని బడుల్లో ప్రదర్శించేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ అనుమతిచ్చారు. ఈ మేరకు శనివారం ఆయన ఉత్తర్వులు జారీచేశారు. ఎన్‌‌సీఈఆర్‌‌‌‌టీ నిపుణుల కమిటీ ఈ మూవీని రివ్యూ చేసి, విద్యార్థులకు విద్యాపరంగా ఉపయోగకరంగాఉంటుందని సిఫార్సు చేయడంతో ఈ అనుమతి ఇచ్చారు.

ప్రభుత్వ, ఎయిడెడ్, మోడల్, రెసిడెన్షియల్ స్కూళ్ల పిల్లలకు ఈ ప్రదర్శన పూర్తిగా ఉచితం కాగా, ప్రైవేట్ స్కూళ్ల స్టూడెంట్లకు రూ.35 టికెట్ ధరగా నిర్ణయించారు. ఈ సినిమా ప్రదర్శనను స్కూల్ టైమింగ్స్‌‌కు ఇబ్బంది కలుగకుండా.. కేవలం ఉదయం 8:30 నుంచి 10:30 గంటల మధ్యే వేయాలని స్పష్టం చేశారు. డిసెంబర్ వరకు మాత్రమే ఈ పర్మిషన్ ఉంటుందని, సినిమా చూడటం అనేది పూర్తిగా విద్యార్థుల ఇష్టమని వెల్లడించారు. ఏ స్కూల్‌‌ను లేదా స్టూడెంట్‌‌ను బలవంతం చేయకూడదని రూల్ పెట్టారు.