‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ చిత్రంతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న శ్రీధర్ గాదె.. మరో కొత్త సినిమాను ప్రకటించాడు. శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై వెంకట్ తలారి తమ ప్రొడక్షన్ నెం.3గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘కమిటీ కుర్రోళ్లు’ ఫేమ్ ఈశ్వర్ రాచి రాజు హీరోగా నటిస్తుండగా, నందు, లిఖిత హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. పూజిత పొన్నాడ, సింధు కాసారం ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సోమవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.
ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి క్లాప్ కొట్టి, దర్శక నిర్మాతలకు స్క్రిప్ట్ అందజేశారు. దర్శకుడు వీరభద్రం చౌదరి కెమెరా స్విచాన్ చేశారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని డైరెక్టర్ కోదండ రామిరెడ్డి టీమ్‌కు బెస్ట్ విషెస్ తెలియజేశారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే హారర్ చిత్రమిది అని, త్వరలోనే ఇతర వివరాలను వెల్లడిస్తామని మేకర్స్ చెప్పారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు.
