యాపిల్ మాజీ సీఈవో స్టీవ్ జాబ్స్ బతికే ఉన్నారా? అదేం పిచ్చి ప్రశ్న.. ఆయనెప్పుడో చనిపోయారుగా అంటారా? అవును.. నిజమే పాంక్రియాటిక్ కేన్సర్‌తో ఆయన2011 అక్టోబర్ 5న చనిపోయారు. కానీ, పైన ఫొటో చూడండి. అచ్చం స్టీవ్ జాబ్స్‌లా లేడూ..! ఆ ఫొటోను ఈజిప్ట్‌లో తీశారట. ఆదివారం రెడ్డిట్‌లో ఓ యూజర్ పోస్ట్ చేశాడు. అప్పట్నుంచి స్టీవ్ జాబ్స్ బతికే ఉన్నారన్న కామెంట్లు ఆ ఫొటోకు వస్తున్నాయి. ఆయన టెక్ గురూ స్టీవ్ జాబ్సేనని కొందరు కరాఖండిగా చెప్పేస్తున్నారు. ‘‘ఆయనకు సింపుల్‌గా బతకడమంటే ఇష్టం. అందుకే ఈజిప్ట్‌లో ఎవరికీ తెలియకుండా బతుకుతున్నారు” అంటూ కామెంట్ చేస్తున్నారు.
