చీమకు హాని తలపెట్టని అమాయకురాలంట..కానీ 8 మంది పసికందుల్ని ఎలా హత్య చేసిందంటూ కుటుంబసభ్యులు, బంధువులు విచారం వ్యక్తం చేస్తున్నారు. పసికందుల మరణాల వెనుక ఏదో మతలబు ఉందంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇంగ్లాండ్ లోని ఛెస్టర్ కౌంటీ ఆస్పత్రిలో 2015 – 16 మధ్య అప్పుడే పుట్టిన పసికందులు చనిపోవడం కలకలం రేపింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలుమార్లు విచారణ చేపట్టారు. అయితే 2018లో 8మంది నవజాత శిశువుల హత్య, ఆరుగురిని హత్య చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో నర్స్ లూసీ (30)ని అరెస్ట్ చేశారు. ఆ తరువాత 2019లో..,2018కు సంబంధించి హత్యకేసులపై అరెస్ట్ చేశారు. బెయిల్ పై విడుదలైంది. తాజాగా అదే ఆస్పత్రిలో 8మంది నవజాత శిశువుల్ని హత్య చేయడంతో ఆమెను అరెస్ట్ చేసి 16ఛార్జ్ షీట్లను దాఖలయ్యాయి. మరో రెండు రోజుల్లో కేసు విచారణ కు రానుంది.
మరోవైపు ఈ హత్యలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోయినప్పటికి ..పోలీసులు మాత్రం ఆస్పత్రిలో పిల్లల్ని హత్య చేసింది లూసీనేనన్న ఆధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు.
