టెక్నికల్‌‌‌‌‌‌‌‌ పోలీసింగ్‌‌‌‌‌‌‌‌తోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట : డీజీపీ సీవీ ఆనంద్

టెక్నికల్‌‌‌‌‌‌‌‌ పోలీసింగ్‌‌‌‌‌‌‌‌తోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట : డీజీపీ సీవీ ఆనంద్
  • సైబర్ సెక్యూరిటీలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపాలి: డీజీపీ సీవీ ఆనంద్
  • సైబర్ సెక్యూరిటీ, ఈ-జీరో ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్, సీసీటీఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌పై సమీక్ష

హైదరాబాద్, వెలుగు: రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు టెక్నాలజీ వినియోగంలో ముందుండాలని డీజీపీ సీవీ ఆనంద్‌‌‌‌‌‌‌‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన సైబర్ సెక్యూరిటీ ప్రమాణాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచి, జాతీయ స్థాయిలో అగ్రస్థానాన్ని సాధించేలా అన్ని పోలీసు యూనిట్లు కృషి చేయాలని ఆదేశించారు.

గురువారం డీజీపీ కార్యాలయంలో సైబర్ సెక్యూరిటీ, ఈ-జీరో ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్, సీసీటీఎన్‌‌‌‌‌‌‌‌ఎస్ అమలుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న సైబర్ మోసాలు, ముఖ్యంగా ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో జరుగుతున్న క్రైమ్స్‌‌‌‌‌‌‌‌పై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు. ఐ4సీ (ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్) నిర్దేశించిన 9 కీలక ప్రమాణాల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. తొమ్మిది కీలక పనితీరు సూచికల ఆధారంగా రాష్ట్రాలకు జాతీయ ర్యాంకులు కేటాయిస్తారని, అన్నింటిలోనూ తెలంగాణ పోలీసులు సమర్థవంతంగా పనిచేసి నేషనల్ లెవెల్‌‌‌‌‌‌‌‌లో టాప్‌‌‌‌‌‌‌‌లో నిలవాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఈ-జీరో ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్ వ్యవస్థ అమలు ఇంకా పూర్తిస్థాయిలో జరగాల్సి ఉందన్నారు. ప్రజల్లో సైబర్ భద్రతపై అవేర్‌‌‌‌‌‌‌‌నెస్ పెంచాలని సూచించారు. ఈ వీసీలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ సహా పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.