రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.10 రాష్ట్రాల్లో మొత్తం 24 స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. జూన్ 18న పోలింగ్ జరగనుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు ఉంటుంది. జూన్ 20న ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.
జూన్ 1న రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు జూన్ 8 చివరి తేది కాగా.. జూన్ 9న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల విత్ డ్రాకు జూన్ 11 వరకు గడువిచ్చారు. ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 6 వైసీపీనుంచి పిల్లి సుభాష్, పరిమళ్ నత్వాని , అయోధ్య రామిరెడ్డి, టీడీపీనుంచి సానా సతీష్ పదవీకాలం ముగియనుంది. పోలింగ్,ఓట్ల లెక్కింపు జూన్ 18న జరగనుండగా, ఎన్నికల ప్రక్రియ జూన్ 20న ముగుస్తుంది.
