ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఎన్నిక  

ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గం ఎన్నిక  

కొత్త ప్రెసిడెంట్ గా రమాకాంత్ఇనానీ

సీనియర్వైస్ప్రెసిడెంట్‌‌గా  కె.భాస్కర్రెడ్డి

హైదరాబాద్‌‌, వెలుగు: ఫెడరేషన్‌‌ ఆఫ్‌‌ తెలంగాణ ఛాంబర్స్‌ ఆఫ్‌‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ(ఎఫ్‌‌టీసీసీఐ) కొత్త ప్రెసిడెంట్‌‌గా రమాకాంత్‌ ఇనానీ, సీనియర్‌‌‌‌ వైస్‌‌ ప్రెసిడెంట్‌‌గా కే. భాస్కర్‌‌‌‌ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎఫ్‌‌టీసీసీఐ 103 వ యాన్యువల్‌ జనరల్‌ మీటింగ్‌‌లో వీరిని ఎన్నుకున్నారు. వీరు ఏడాది పాటు(2020–21) తమ సేవలను అందిస్తారు. రమాకాంత్‌ ఇనానీ ఎఫ్‌‌టీసీసీఐలో అనేక పదవులను చేపట్టారు. ఆయన గత రెండు దశాబ్దాల నుంచి ఈ ఫెడరేషన్‌‌లో మేనేజింగ్‌‌ కమిటీ మెం బర్‌‌‌‌గా సేవలదించారు. 2019–20 లో ఎఫ్‌‌టీసీసీ సీనియర్‌‌‌‌ వైస్  ప్రెసిడెంట్ గా పనిచేశారు. 1984 లో తన సొంత వ్యాపారాన్ని స్టార్ట్‌‌ చేసిన ఇనానీ, స్టాక్‌‌ బ్రోకింగ్‌‌, నాన్‌‌ బ్యాంకింగ్‌‌ ఫైనాన్స్‌ కంపెనీ, రియల్‌ ఎస్టేట్‌‌, అగ్రికల్చరల్‌ వంటి సెక్టార్లలో వ్యాపారాలు చేస్తున్నారు. సీనియర్‌‌‌‌ వైస్‌‌ ప్రెసిడెంట్‌‌గా ఎన్ని కైన కే భాస్కర్‌‌‌‌ రెడ్డి క్రిమ్‌ లైన్డెయిరీ పేరుతో ఓ కంపెనీని స్టార్ట్‌‌ చేశారు. జెర్సీ బ్రాండ్‌ పేరుతో మిల్క్‌‌ ప్రొడక్స్‌ట్ ను ఈ కంపెనీ అమ్ముతోంది . ప్రస్తుతం ఈ కంపెనీకి దక్షిణాది రాష్ట్రాలలో 11 ప్రాసెసింగ్‌‌ ప్లాంట్‌‌లు ఉన్నాయి. కంపెనీ యాన్యువల్‌ రెవెన్యూ రూ. 1,200 కోట్లకు చేరుకుంది . క్రీమ్‌ లైన్‌‌ డెయిరీ 2015 లో గోద్రేజ్ ఆగ్రోవెట్‌‌ సబ్సిడరీగా మారింది.