హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ (ఈసీ) ఏర్పాట్లు చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలకు ఎన్నికల అధికారులతో పాటు 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లను (ఈఆర్వో) నియమించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటర్ల జాబితాలో ఏవైనా లోపాలుంటే సరిదిద్దేందుకు వీలుగా ఈఆర్వోలను నియమించింది. ఒక్క హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారిగా జీహెచ్ఎంసీ కమిషనర్ వ్యవహరించనుండగా, మిగతా 32 జిల్లాల ఎన్నికల అధికారులుగా కలెక్టర్లు ఉంటారు. ఇక ఈఆర్వోలుగా అడిషనల్ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీవోలు, డిప్యూటీ కమిషనర్లు, మున్సిపల్ కమిషనర్లు తదితరులను నియమించింది.
