హైదరాబాద్, వెలుగు : ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బదిలీల జీవో విడుదల చేయటంపై ఉద్యోగుల జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. ఈ సంద ర్భంగా జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావులు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ రామకృష్ణరావుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ నిర్ణయం న్యాయసమ్మతమైన, పారదర్శకమైన బదిలీ ప్రక్రియ కోసం సహనంతో ఎదురుచూస్తున్న వేలాది ఉద్యో గులకు ఎంతో ఉపశమనం, సంతృప్తి ని కలిగించిందని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జీవో విడుదల ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుంద న్నారు. ఉద్యోగుల సమస్యలను అర్ధం చేసుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి ఒక్కో సమస్యను పరిష్కరిస్తు న్నారని నేతలు పేర్కొన్నారు.

