190 ఈఓ పోస్టుల నోటిఫికేషన్ నకిలీది..మేం ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదు: దేవాదాయ శాఖ

190 ఈఓ పోస్టుల నోటిఫికేషన్ నకిలీది..మేం ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదు: దేవాదాయ శాఖ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర దేవాదాయ శాఖలో 190 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈఓ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనట్టు కొద్దిరోజులుగా వాట్సాప్, ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్ గ్రూపుల్లో ఒక ప్రకటన విపరీతంగా షేర్ అవుతోంది. అయితే, ప్రభుత్వం అసలు అలాంటి నోటిఫికేషనే విడుదల చేయలేదని దేవాదాయ శాఖ గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వైరల్ అవుతున్న ఈ నోటిఫికేషన్ పూర్తిగా నకిలీదని, అనధికారికమైందని అధికారులు తేల్చి చెప్పారు. ప్రస్తుతం శాఖ నుంచి ఎలాంటి రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ప్రక్రియ లేదని స్పష్టం చేశారు. నిరుద్యోగులు, ఉద్యోగార్థులు ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మి, దళారులకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దని అధికారులు కోరారు. ఈ నకిలీ ప్రకటనపై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.