హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖలో పని చేస్తున్న ఈఈ, ఎస్‌ఈ క్యాడర్ ఇంజినీర్ల ప్రమోషన్ల లిస్ట్ ఫైనల్ చేయాలని ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఇంజినీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం మంత్రి కోమటిరెడ్డిని ఆయన నివాసంలో ఆర్ అండ్ బీ ఇంజినీర్స్ అసోసియేషన్ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఏఈ పోస్టుల నుంచి 73 మందికి డీఈలుగా పదోన్నతులు కల్పించినందుకు, అలాగే ఆర్ అండ్ బీ శాఖలో కొత్తగా 222 ఏఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం తరపున నోటిఫికేషన్ విడుదల చేసినందుకు అసోసియేషన్ ప్రతినిధులు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతినిధుల వినతిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.
డీఈ నుంచి ఈఈ, అలాగే ఈఈ నుంచి ఎస్ఈ పోస్టుల ప్రమోషన్లకు సంబంధించిన ఫైల్ ప్రస్తుతం సీఎం ఆఫీస్‌లో పెండింగ్‌లో ఉందని తెలిపారు. రెండ్రోజుల్లో ఈ ఫైల్‌ను క్లియర్ చేయించి, ప్రమోషన్ఆర్డర్లు వచ్చేలా చర్యలు తీసుకుంటానని వారికి భరోసా ఇచ్చారు. అలాగే చాలా ఏండ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్‌లో ఉన్న సీనియారిటీ ఇంజినీర్ల జాబితాను సైతం ఇక్కడికి రప్పించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో ఆర్అండ్బీ ఇంజినీర్స్అసోసియేషన్ప్రెసిడెంట్ శ్రీనివాస్, రాంబాబు, మహేందర్, శరత్చంద్ర తదితరులు ఉన్నారు.
