రాహుల్ సెంచరీ వృథా.. సెకండ్ వన్డేలో ఇంగ్లాండ్ విక్టరీ

రాహుల్ సెంచరీ వృథా.. సెకండ్ వన్డేలో ఇంగ్లాండ్ విక్టరీ

భారత్ తో జరిగిన సెకండ్ వన్డేలో ఇంగ్లాండ్ విజయం సాధించింది. 337 పరుగుల భారీ టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ 6 వికెట్ల తేడాతో  గెలుపొందింది. ఇంగ్లాండ్  బ్యాట్స్ మెన్ బెయిర్ స్టో 112 బంతుల్లో 124, బెన్ స్టోక్స్ 52 బంతుల్లో 99 చెలరేగడంతో ఇంగ్లాండ్ 43.3 ఓవర్లలోపే లక్ష్యాన్ని చేధించింది. జాసన్ రాయ్ 55,లివింగ్ స్టన్ 27తో రాణించారు. భారత బౌలర్లు వికెట్లు తీయడానికి చెమటోడ్చారు. భారీగా పరుగులిచ్చుకున్నారు. భారత బౌలర్లకు ప్రసిద్ధ కృష్ణకు 2,భువనేశ్వర్ కు ఒక వికెట్ పడ్డాయి.

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియా 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 336 పరుగులు చేసింది.  రాహుల్ 114 బంతుల్లో 108 ..రిషబ్ పంత్ 40 బంతుల్లో 77 పరుగులతో కదం తొక్కారు. ఓనర్లు రోహిత్ శర్మ 25 ధావన్ 4, విరాట్ కోహ్లీ 66, కృనాల్ పాండ్యా12(నాటౌట్) పరుగులు చేశారు. చివర్లో వచ్చిన హార్దిక్ పాండ్యా సిక్సులతో హోరెత్తించాడు. 4 సిక్సులు ఒక ఫోర్ తో  16 బంతుల్లో 35 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ కు 337 టార్గెట్ పెట్టారు. ఇంగ్లాండ్ బౌలర్లలో రీస్ టోప్లీ 2, టామ్ కరణ్ 2, సామ్  కరణ్ , ఆదిల్ రషీద్ లకు చెరో ఒక వికెట్ పడ్డాయి. మూడు వన్డేల సిరీస్ లో ఇరు జట్లు 1-1 సమంగా ఉన్నాయి. సిరీస్ కైవసం చేసుకోవాలంటే ఇరు జట్లు నెక్స్ట్ వన్డేలో తప్పక విజయం సాధించాలి. 28న మూడో వన్డే జరగనుంది.