V6 News

లారెస్‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ అవార్డ్స్ వ్యాఖ్యాతగా జొకోవిచ్‌‌‌‌‌‌‌‌

లారెస్‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ అవార్డ్స్ వ్యాఖ్యాతగా జొకోవిచ్‌‌‌‌‌‌‌‌

మాడ్రిడ్‌‌‌‌‌‌‌‌: టెన్నిస్‌‌‌‌‌‌‌‌ రాకెట్‌‌‌‌‌‌‌‌తో అద్భుత విజయాలు సాధించిన సెర్బియా సూపర్‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌ నొవాక్‌‌‌‌‌‌‌‌ జొకోవిచ్‌‌‌‌‌‌‌‌ ఇప్పుడు కొత్త పాత్ర ధరించబోతున్నాడు. క్రీడా ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘లారెస్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ అవార్డుల’ వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. 

ఫ్రీస్టైల్‌‌‌‌‌‌‌‌ స్కీయర్‌‌‌‌‌‌‌‌ ఐలీన్‌‌‌‌‌‌‌‌ గూతో కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లనున్నాడు. క్రీడా చరిత్రలో ఇద్దరు ప్లేయర్లు కలిసి ఈ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించడం ఇదే తొలిసారి. 

స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌, వినోదం, సంస్కృతి రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొంటారు. క్రీడా స్ఫూర్తిని, పట్టుదలను చాటిన విజేతలకు అవార్డులను అందజేయనున్నారు. 24 గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్‌‌‌‌‌‌‌‌ టైటిల్స్‌‌‌‌‌‌‌‌ నెగ్గిన జొకోవిచ్‌‌‌‌‌‌‌‌.. ఐదుసార్లు ‘లారెస్‌‌‌‌‌‌‌‌’ అవార్డును సొంతం చేసుకున్న తొలి మెన్స్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా రికార్డు సృష్టించాడు.